టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన

ఖమ్మం జిల్లా బీజేపీ కోశాధికారి కొణతం లక్ష్మీనారాయణ

టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన

ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)

ఖమ్మం జిల్లా బీజేపీ కోశాధికారి  కొణతం లక్ష్మీనారాయణ టిబీజేఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తాను ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలుసుకున్న కొణతం లక్ష్మీ నారాయణ, సామ్రాట్ గుప్తాకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఎప్పుడూ చురుకుగా ఉండే జర్నలిస్ట్ నాయకుడుగా మరింత ఉత్సాహంతో తిరిగి కార్యకలాపాల్లో పాల్గొనాలని సూచించారు.

అలాగే సామ్రాట్ గుప్తా కుమారుడు కూడా ప్రమాదానికి గురైన విషయం తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొంటూ, వైద్యుల సూచనల ప్రకారం విశ్రాంతి తీసుకుని పూర్తిస్థాయిలో కోలుకోవాలని కొణతం లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .