10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ...

10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ...

ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)

 చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో అనంతసాగర్ యంగ్ వారియర్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పబ్లిక్ పరీక్షల కోసం అవసరమైన పరీక్ష సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నారపోగు వీరభద్రం, వేర్పుల రామకృష్ణ, దుమాల రామారావు మరియు ఎస్ వి ఎన్  పవన్  ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం ఈరోజు అనంతసాగర్ గ్రామ ప్రైమరీ స్కూల్లో జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులకు పాడ్లు, పెన్నులు, స్కేలు, పెన్సిళ్లు పంపిణీ చేయడంతో పాటు పబ్లిక్ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలనే అంశాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జడ ప్రమీల పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు.అలాగే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మర్రి భాస్కర్  ( ఎస్.ఏ తెలుగు), ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ వి ఎన్ పవన్  (ఎస్ ఏ భౌతిక శాస్త్రం), జానపాటి ఉపేందర్  (ఎస్ ఏ సోషల్ స్టడీస్) పాల్గొని విద్యార్థులకు పరీక్షలపై సూచనలు అందించారు. యూత్ అసోసియేషన్ సభ్యులు కన్నెగంటి వీరయ్య, వేర్పుల సైదులు, గడ్డం శ్రవణ్ కుమార్, వేర్పుల ఉపేందర్, నారపోగు వీరభద్రం తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .