మణిగిళ్ల ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానం
పెద్దమందడి,మార్చ్2(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ ఉపాధ్యాయ బృందంతో కలిసి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభిని కలిసి పాఠశాల వార్షికోత్సవానికి ఆహ్వాన పత్రం అందజేశారు.మణిగిళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 7వ తేదీన నిర్వహించబడనున్న విద్యార్థుల వార్షికోత్సవ వేడుకలకు హాజరై విద్యార్థులను ఆశీర్వదించాలని కోరారు.అలాగే సంయుక్త జిల్లా కలెక్టర్ కీమ్య నాయక్ ని కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలను అధికారులకు వివరించారు.వార్షికోత్సవం విజయవంతం కావాలని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు వెంకటేష్, ఉపాధ్యాయులు జానయ్య, రాములు, సుధాకర చారి, రఫీ. తదితరులు పాల్గొన్నారు.


Comments