మహిళలకు స్ఫూర్తిదాయకమైన భవిష్యత్తు కావాలి

ఎల్కతుర్తి ప్రెస్ క్లబ్

మహిళలకు స్ఫూర్తిదాయకమైన భవిష్యత్తు కావాలి

ఎల్కతుర్తి, మార్చ్ 8 (తెలంగాణ ముచ్చట్లు):

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎల్కతుర్తి ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఎల్కతుర్తి వానవీహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాతురి చంద్రమౌళి మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు.
మహిళల గౌరవం, భద్రత, సమాన హక్కులు సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. మహిళల సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ సంతోషకరమైన, స్ఫూర్తిదాయకమైన భవిష్యత్తు కలగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కందుకూరి రాజన్న, ఉపాధ్యక్షులు చిర్ర ఉదయచందర్, రామోజు సతీష్ చారి, ప్రధాన కార్యదర్శి సిద్ధాంతి సదా నిరంజన్, కోశాధికారి కందుకూరి మహేశ్వరాచారి, కార్యదర్శులు కొలిపాక శ్రీనివాస్, జూపాక శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి నల్లా రాజిరెడ్డి, కార్యవర్గ సభ్యులు బొంకూరి వంశీ, కర్రె తిరుపతి, నరేష్ బెజ్జంకి, ఎర్రొల్ల రాజబాబు, అడ్డూరి అనిల్, అంబాలా ప్రవీణ్, సభ్యులు ఎర్రొల్ల సతీష్, చిలుములా ప్రమోద్, కంచెర్ల సదానందం, అడ్డూరి శ్రీకాంత్, సుద్దాల జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మహిళలకు స్ఫూర్తిదాయకమైన భవిష్యత్తు కావాలి మహిళలకు స్ఫూర్తిదాయకమైన భవిష్యత్తు కావాలి
ఎల్కతుర్తి, మార్చ్ 8 (తెలంగాణ ముచ్చట్లు): హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఎల్కతుర్తి ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని...
ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్ కానుకగా ₹5016 అందజేత
ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన కాప్రా ప్రింట్ మీడియా ప్రతినిధులు
చిత్తశుద్ధితో ఇస్తేనే.. నిజమైన జకాత్
ఘనంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవం
వనపర్తిలో కేంద్రీయ విద్యాలయానికి గ్రీన్ సిగ్నల్
కాజీపేట్ లో రైల్వే ఉద్యోగులపై సిబిఐ కేసు నమోదు