మీర్పేట్‌ హెచ్‌బి కాలనీలో హోలీ వేడుకల్లో భాగంగా కాముడి దహనం

మీర్పేట్‌ హెచ్‌బి కాలనీలో హోలీ వేడుకల్లో భాగంగా కాముడి దహనం

నాచారం, మార్చి 03 (తెలంగాణ ముచ్చట్లు):

హోలీ పండుగను పురస్కరించుకుని నాచారం సర్కిల్‌లోని మీర్పేట్ హెచ్‌బి కాలనీ డివిజన్‌లో రాజస్థాని మార్వాడి సంఘం ఆధ్వర్యంలో కాముడి దహన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, ఎస్‌ఐ విజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాత కట్టెలు, పిడుకలతో పెద్ద మంట వెలిగించి కాముడిని దహనం చేశారు.అనంతరం జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ హోలీ పండుగ చెడుపై మంచి గెలిచిన సంకేతమని పేర్కొన్నారు. మనలోని కామం, అహంకారం, చెడు ఆలోచనలను దహనం చేసి సత్సంకల్పాలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. కాముడి దహనం ఆత్మపరిశుద్ధికి, సత్సంస్కారాల పెంపొందింపుకు ప్రతీకగా భావిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్వాడి సంఘం అధ్యక్షుడు కైలాష్ శర్మతో పాటు నరేష్ సాంక్ల, పవన్ కుమార్ శర్మ, బాబులాల్ జీ, సి. సిర్వీ, దుర్గా రామ్, వినోద్ జైన్, బైరొ సింగ్, నారాయణ లాల్, నేమిచంద్ కచ్చావ, సోహన్ లాల్ సిర్వీ, దినేష్ టాంక్, నరేష్ ఖండెల్వాల్, చోగారం సిర్వీ, అనిల్ జైన్, ప్రకాష్ చౌదరి, ఓం ప్రకాష్ చౌదరి, పురుషోత్తం తివారి, సునీల్ జీ అశోక్, అనిల్ గుప్తా, దేవేందర్ కుమార్, శేఖర్ గౌడ్ తదితరులు మరియు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.IMG-20260303-WA0075

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .