మౌలాలి కమాన్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

మౌలాలి కమాన్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం యువకుడు మృతి

మౌలాలి, మార్చి 03 (తెలంగాణ ముచ్చట్లు): 

మౌలాలి కమాన్ పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో బాలుడు గాయపడ్డాడు.దమ్మాయిగూడ సాయిబాబా నగర్‌కు చెందిన మండల అనిల్ కుమార్ (42), వృత్తి వాటర్ ప్లాంట్ కార్మికుడు, ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన తెలిపిన ప్రకారం, మార్చి 3న తన చిన్న కుమారుడు రుషికేష్ (15) తన స్నేహితుడితో కలిసి హలీమ్ తీసుకోవడానికి మౌలాలికి వెళ్లాడు.అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో మౌలాలి కమాన్‌లోని నూర్ స్కూల్ ఎదురుగా టీవీఎస్ ఎక్స్ఎల్ (ఏపి10 పి7401) వాహనం మరియు కెటిఎమ్ (టీఎస్05 ఎఫ్ఎల్1349) బైక్ ఢీకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కెటిఎమ్ బైక్ రైడర్ అతివేగంగా మరియు నిర్లక్ష్యంగా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ టీవీఎస్ ఎక్స్ఎల్  ను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో కెటిఎమ్ బైక్ రైడర్ దేశ్పక్ శ్రేయంత్ (23), రాంనగర్ నివాసి, ఈసీఐఎల్ లోని హ్యుందాయ్ షోరూమ్‌లో స్టోర్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నాడు, తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై  కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీసులు సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఘనంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవం ఘనంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ వార్షికోత్సవం
- జర్నలిస్టుల ఐక్యతకు ప్రతీక  - యూనియన్లకు అతీతంగా వేడుక ఖమ్మం బ్యూరో, మార్చి 03(తెలంగాణ ముచ్చట్లు)  ఖమ్మం ప్రెస్ క్లబ్ 24వ  వార్షికోత్సవ వేడుకలు మంగళ...
వనపర్తిలో కేంద్రీయ విద్యాలయానికి గ్రీన్ సిగ్నల్
కాజీపేట్ లో రైల్వే ఉద్యోగులపై సిబిఐ కేసు నమోదు 
చీర మెడకు చుట్టుకుని ప్రమాదవశాత్తు బాలిక మృతి
మీర్పేట్‌ హెచ్‌బి కాలనీలో హోలీ వేడుకల్లో భాగంగా కాముడి దహనం
మౌలాలి కమాన్ వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం యువకుడు మృతి
టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన