మండల కమిటీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

డా. జిల్లెల చిన్నారెడ్డి

మండల కమిటీలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

వనపర్తి,మార్చి9(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో శ్రీరంగాపురం మండలం, పెబ్బేరు మండలం, పెబ్బేర్ టౌన్‌లలో నూతన మండల కమిటీలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయనతో పాటు నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి నూతన కమిటీలను ప్రకటించారు.ఈ సందర్భంగా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు.స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని పేదరికం నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ నాయకుల పాత్ర శూన్యమని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, పేదరిక నిర్మూలనకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకే పదవులు దక్కుతాయని తెలిపారు.దేశంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోందని, రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు కోట్ల రవి, వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిర రాముల యాదవ్, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పురుషోత్తం, శ్రీరంగాపురం మండల అధ్యక్షుడు రాములు యాదవ్, వనపర్తి జిల్లా ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు రోహిత్, వనపర్తి మండల ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, శ్రీరంగాపురం గ్రామ సర్పంచ్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .