ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన కాప్రా ప్రింట్ మీడియా ప్రతినిధులు

ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసిన కాప్రా ప్రింట్ మీడియా ప్రతినిధులు

కాప్రా, మార్చ్ 05 (తెలంగాణ ముచ్చట్లు):

నూతనంగా ఎన్నికైన కాప్రా ప్రధాన పత్రికల సీనియర్ జర్నలిస్టులతో కూడిన ప్రెస్ క్లబ్ కార్యవర్గం గురువారం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించింది.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కాప్రా ప్రధాన పత్రికల ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులకు ఎంపీ ఈటల రాజేందర్ అభినందనలు తెలిపారు. జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులని పేర్కొంటూ, వారి సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జ్యోతిర్మయ చారి, ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాస్, కోశాధికారి వట్టిపల్లి సురేష్, ఉపాధ్యక్షులు పలుగుల పవన్, లక్కిడి బాలరెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి గడ్డమీద బాలరాజు గౌడ్ పాల్గొన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్టులు కేసీ మోహన్, క్యాసాని సత్యనారాయణ, సహదేవా చారి, వేముల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .