విద్యార్థులే ఉపాధ్యాయులు… సందడిగా స్వయం పరిపాలన దినోత్సవం

విద్యార్థులే ఉపాధ్యాయులు… సందడిగా స్వయం పరిపాలన దినోత్సవం

పెద్దమందడి,మార్చి9(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మద్దిగట్ల- మోజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం  స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 48 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ వివిధ పాఠ్యాంశాలను బోధించారు.విద్యార్థులు కృత్యాధార పద్ధతి, చార్టులు, నమూనాల ద్వారా పాఠాలను బోధిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు.ఉదయం 9 గంటలకు ప్రార్థనతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు ఉత్సాహంగా కొనసాగింది.ఈ సందర్భంగా కుమారి ఎస్.శిరీష కలెక్టర్‌గా, ఎం. మౌలాలి అడిషనల్ కలెక్టర్‌గా, కుమారి పి. దీప్తి జిల్లా విద్యాశాఖ అధికారిణిగా, కుమారి ఎం.అఖిల మండల విద్యాశాఖ అధికారిగా, కుమారి జే. వైష్ణవి ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్.వరప్రసాద్ రావు, ఉపాధ్యాయులు డి. రణదీవ్, పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, శ్రీమతి వాణి ప్రభ, ఎం. పుల్లయ్య, మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, ఏ.వెంకటస్వామి, కె.శ్రీనివాసులు, కృష్ణవేణి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా పి.వెంకటస్వామి, శ్రీమతి వాణి ప్రభ,  ఏ. వెంకటస్వామి వ్యవహరించారు.ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్.వరప్రసాద్ రావు మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నాయకత్వ లక్షణాలు, బాధ్యతా భావం పెంపొందుతాయని తెలిపారు.ఉపాధ్యాయులు డి. రణదీవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు.పి. వెంకటస్వామి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా బోధిస్తూ కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించారని అన్నారు.గద్వాల కృష్ణయ్య మాట్లాడుతూ దాదాపు 48 మంది విద్యార్థులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. శ్రీమతి వాణి ప్రభ విద్యార్థుల బోధన చాలా బాగుందని ప్రశంసించారు.ఎం. పుల్లయ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన విభాగంలో ఎంతో కృషి చేశాడని తెలిపారు.మధుసూదన్ మాట్లాడుతూ.. విద్యార్థులు నిజమైన ఉపాధ్యాయుల్లా వ్యవహరించారని అన్నారు.ఎన్. వెంకటస్వామి మాట్లాడుతూ ఐదుగురు విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులుగా వ్యవహరించి ఆటల ద్వారా విద్యార్థులను ఉత్సాహపరిచారని చెప్పారు.ఏ. వెంకటస్వామి మాట్లాడుతూ విద్యార్థుల బోధన, నైపుణ్యం ఆకట్టుకుందని అన్నారు. కె. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఒక్క రోజులోనే కృత్యాలు సిద్ధం చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ పాఠశాల తరఫున గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్.వరప్రసాద్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .