రైతుల నష్టాలను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య

రైతుల నష్టాలను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

ఎల్కతుర్తి, మే 19 (తెలంగాణ ముచ్చట్లు):

రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని యువజన కాంగ్రెస్ హుస్నాబాద్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య అన్నారు. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. తేమ శాతం, తాలు పేరుతో క్వింటాల్‌కు 5 నుంచి 6 కిలోల వరకు కోతలు విధించడం, గన్నీ సంచుల కొరత, రవాణా సమస్యలు, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల లేమి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.
ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసి వెంటనే మిల్లులకు తరలించేలా వ్యవసాయ, రెవెన్యూ, రవాణా శాఖ అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
రైతుల సమస్యలను పట్టించుకోని మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు, ప్రస్తుతం రైతుల కోసం కృషి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతుల నష్టాలను అరికట్టి వారికి పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎర్రోళ్ల చైతన్య తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉమ్మడి మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం. ఉమ్మడి మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.
పెద్దమందడి,మే19(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా  పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మండలాల ఉమ్మడి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన కొత్తకాపు వెంకటేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా...
జర్నలిస్టులు ప్రజల సమస్యలకు వారధిగా నిలవాలి: ప్రణవ్ బాబు.
హుజురాబాద్‌లో ట్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం.
రైతుల నష్టాలను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కీలక సూచన.
మక్కల కొనుగోళ్లపై రైతులకు భరోసా ఇచ్చిన వొడితల ప్రణవ్.