ప్రమాదంతో నష్టపోయిన రైతులకు అండగా ప్రణవ్…

కాంగ్రెస్ ప్రభుత్వం మీతోనే ఉంది’ భరోసా.

ప్రమాదంతో నష్టపోయిన రైతులకు అండగా ప్రణవ్…

• త్వరితగతిన నష్టపరిహారం అందించాలని ఆదేశాలు
 
జమ్మికుంట రూరల్ మే 06 (తెలంగాణ ముచ్చట్లు):
 
వావిలాల నుంచి వంతడుపుల వెళ్లే రహదారిపై జరిగిన ప్రమాదంలో నష్టపోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ భరోసా ఇచ్చారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి రైతులను ఆదుకోవాలని సూచించినట్లు తెలిపారు.
బుధవారం సంఘటన స్థలానికి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి చేరుకున్న ప్రణవ్, నష్టపోయిన రైతులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు, పంట నష్టం వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రణవ్‌ను చూసిన రైతులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమవ్వగా, వారిని ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. “ఇది రైతు ప్రభుత్వం… రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం. మీరు అధైర్యపడవద్దు, మేమున్నాం” అంటూ భరోసా కల్పించారు.
అధికారులతో ఫోన్‌లో మాట్లాడి నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వావిలాల సర్పంచ్ అర్జున్, తనుగుల సర్పంచ్ కిరణ్, మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు మెలుగురీ సదయ్య, మండల, పట్టణ అధ్యక్షులు పరశురామ్, రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సజ్జు, సీనియర్ నాయకులు దేశిని కోఠి, రాకేష్ రెడ్డి, సాయిని రవి, పూరేళ్ళ రాకేష్, పొనగంటి మధు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.IMG-20260506-WA0116
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .