ఆయిల్ పామ్ సాగుతో రైతులకు బంగారు భవిష్యత్తు.

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు బంగారు భవిష్యత్తు.

ప్రత్యామ్నాయ పంటలతో స్థిర ఆదాయం సాధ్యం
 
-- డా. జిల్లెల చిన్నారెడ్డి
 
వనపర్తి,మే6(తెలంగాణ ముచ్చట్లు): 
 
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రైతు వారోత్సవాల సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. అధిక వంటనూనె దిగుబడిని ఇచ్చే పంటలలో ఆయిల్ పామ్ ప్రధానమని తెలిపారు.దేశంలో పెరుగుతున్న వంటనూనె అవసరాల దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలు, డ్రిప్ సిస్టమ్, ఎరువులు, రవాణా వంటి సౌకర్యాలు కల్పిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు.ఆయిల్ పామ్ తోటల్లో కోకో, జాజికాయ వంటి అంతర పంటలు సాగు చేస్తే రైతులకు ఏడాది పొడవునా స్థిర ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.మూడు సంవత్సరాల తర్వాత దిగుబడి వచ్చే ఈ పంటకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని అన్నారు.ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును కూడా ప్రోత్సహిస్తోందని, రైతులు మొక్కజొన్న, పత్తి, ఆముదం, కూరగాయల సాగు ద్వారా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. సంకిరెడ్డిపల్లి, బీచ్‌పల్లి ప్రాంతాల్లో కొత్త ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, రిటైర్డ్ వ్యవసాయ అధికారి కృపాకర్ రెడ్డి, జిల్లా హార్టికల్చర్ అధికారి విజయభాస్కర్ రెడ్డి, శాస్త్రవేత్త రాజేందర్ రెడ్డి, వీణ జోషి, కాంగ్రెస్ నాయకులు, రైతులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.IMG-20260506-WA0093
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .