ప్రాధాన్య అభివృద్ది పనులను వేగవంతం చేయాలి.....
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్.
Views: 7
On
ఖమ్మం బ్యూరో , మే-04(తెలంగాణ ముచ్చట్లు )
ప్రాధాన్య అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన ప్రాధాన్య అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇల్లందు రోడ్ వద్ద ఉన్న నిర్మాణాన్ని రేన్నోవేషన్ చేసి ఫ్రూట్ మార్కెట్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలు సమయానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫ్రూట్ మార్కెట్ కాంపౌండ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించి నిధులు మంజూరు పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. శిల్పారామం కోసం ఇప్పటికే 9 ఎకరాలు ఇవ్వడం జరిగిందని, అదనంగా 3 ఎకరాలు 21 గుంటలు అవసరమని, వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను సమయానికి పూర్తి చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని తెలిపారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో భాగంగా ప్రధాన సీవరేజ్ పైపులైన్ పనులను వేగవంతం చేయాలని, మొత్తం 8.5 కి.మీ పైపులైన్‌లో ఇప్పటికే 7.7 కి.మీ పూర్తి అయినందున మిగిలిన పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథతో ఎటువంటి మిక్సేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ధంసలాపురం వద్ద ఎస్టీపీ పనులు త్వరలో ప్రారంభించాలని తెలిపారు. హరిత హోటల్ నిర్మాణానికి భూమి అప్పగించడం జరిగిందని, వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ-9లో కొంత మేరకు భూసేకరణ సమస్య ఉందని, స్థానికులతో చర్చించి త్వరగా పరిష్కరించాలని, తహసీల్దార్, సబ్ కలెక్టర్‌ను భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments