మడిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

మడిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.

- మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలి… రైతులకు ప్రజా ప్రతినిధుల సూచనలు
 
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
 
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో సంయుక్త గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ మ్యా కమల్ల తిరుమల వెంకటేష్, ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్, పాలకవర్గ సభ్యులు పాల్గొని కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు నేరుగా కొనుగోలు కేంద్రంలోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. రైతులు నాణ్యమైన, బాగా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి సరైన గిట్టుబాటు ధర పొందాలని కోరారు.
సర్పంచ్ తిరుమల వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రేడ్–ఏ రకానికి క్వింటాల్‌కు రూ.2,389 ధర లభిస్తుందని తెలిపారు. గ్రామ స్థాయిలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు సౌకర్యాలు కల్పించామని, త్రాగునీరు సహా అన్ని అవసరాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
ఎండలు అధికంగా ఉన్నందున రైతులకు బార్ధాన్ సంచులు సమృద్ధిగా అందించాలని, కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అకస్మాత్తుగా వర్షాలు పడినపుడు రైతులకు టార్పాలిన్లు అందించాలన్నారు. మిల్లుల వద్ద తేమ సాకుతో కోతలు లేదా తరుగు విధించినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని, అలాంటి సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అంజిరెడ్డి ఆదిత్య రాజు, వార్డు సభ్యులు పసరగుండ శ్రీనివాస్, సింగవేణ చంద్రమౌళి, తాళ్లపల్లి ఆంజనేయులు, ఐకెపి ప్రతినిధులు, సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .