ప్రజావాణిలో తాగునీరు, డ్రైనేజ్ సమస్యలపై కాంగ్రెస్ వినతి.

ప్రజావాణిలో తాగునీరు, డ్రైనేజ్ సమస్యలపై కాంగ్రెస్ వినతి.

_ఉప్పల్ వాటర్ వర్క్స్ అధికారులతో చర్చ 

– కాలనీల సమస్యల త్వరిత పరిష్కారానికి హామీ

మల్లాపూర్, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజావాణి కార్యక్రమంలో ఉప్పల్ వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్, డీజీఎం వేణుగోపాల్, మల్లాపూర్ ఏఈ రోహిత్‌లతో కలిసి కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ మరియు వారి బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంతంలో నెలకొన్న తాగునీటి మరియు డ్రైనేజ్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.“బస్తీబాట” కార్యక్రమంలో ప్రజలు వ్యక్తపరిచిన సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యంగా కే.ఎల్.రెడ్డి, హెచ్‌సిఎల్ కాలనీ, అన్నపూర్ణ, భవాని నగర్ కాలనీలలో తక్కువ ప్రెషర్‌తో తాగునీటి సరఫరా జరుగుతుండటం, ఓల్డ్ మల్లాపూర్‌లో మదీనా చికెన్ సెంటర్ ఎదురుగా కొత్త వాటర్ లైన్ మరియు కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం, పలు కాలనీలలో డ్రైనేజ్ లైన్ల ఏర్పాటు వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సమస్యలపై స్పందించిన జీఎం సంతోష్ కుమార్ వాటిని అత్యవసరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే నెమలి అనిల్ కుమార్ కృషిని స్థానికులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు కోయలకొండ రాజేష్, శంకర్ గౌడ్, పిడిశెట్టి సురేష్, అన్వర్ పఠాన్, సాయి కుమార్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .