రాజ్యాంగమే ప్రజా స్వామ్యాని కి బలమైన కవచం సీపీఐ.

రాజ్యాంగమే ప్రజా స్వామ్యాని కి బలమైన కవచం సీపీఐ.

_అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు 

_ఈసీఐఎల్‌లో ఘనంగా నిర్వహణ

కుషాయిగూడ, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు)

భారత రాజ్యాంగాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రజాస్వామ్యాన్ని రక్షించేది రాజ్యాంగమేనని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వియస్. బోస్ అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం ఈసీఐఎల్‌లోని సీపీఐ కార్యాలయం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ దేశానికి సమానత్వం, సామాజిక న్యాయం అనే విలువలను అందించిన మహానుభావుడని కొనియాడారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. సమానత్వం, స్వేచ్ఛ, సెక్యులరిజం వంటి ప్రాథమిక విలువలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.మతపరమైన రాజకీయాలు, విభజనాత్మక ధోరణులు దేశ ఏకత్వానికి ముప్పుగా మారుతున్నాయని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని కాపాడటం అంటే దేశాన్ని కాపాడటమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర, సీపీఐ నాయకులు ఎస్. శంకర్ రావు, టి. సత్య ప్రసాద్, నారా నర్సింహా, బాబురావు, నర్సింహా రావు, గిరిబాబు, రాజ్ కుమార్, మహేష్, అజీమ్ పాషా, అశోక్, లక్ష్మణ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అంబేద్కర్ అందరివాడు అంబేద్కర్ అందరివాడు
హన్మకొండ,ఏప్రిల్14(తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో వరంగల్ పార్లమెంట్...
పామిరెడ్డిపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ ఆశయాల సాధనతోనే సమాజంలో నిజమైన సమానత్వం సాధ్యం .
యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందాలి.
చిన్నపెండ్యాలలో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు .
అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి ఘన నివాళులు.
మేడ్చల్–మల్కాజిగిరిలో అంబేద్కర్ జయంతి వేడుకలు.