హెల్మెట్ లేకుంటే  ప్రవేశం లేదు.

సీఐ వేణు 

హెల్మెట్ లేకుంటే  ప్రవేశం లేదు.

స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 13 (తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని మీదికొండ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వేణు గ్రామస్తులకు కీలక సూచనలు చేశారు.
“హెల్మెట్ లేకుంటే గ్రామములోనికి ప్రవేశం లేదు” అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రజల ప్రాణ భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం తగ్గుతుందని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. యువత వేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం చేయకూడదని తెలిపారు. సీట్‌బెల్ట్, హెల్మెట్ వంటి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
గ్రామస్తులు పోలీస్ శాఖతో సహకరించి రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై వినయ్ కుమార్ సర్పంచ్ జోగు సంపత్ కుమార్, ఉపసర్పంచ్ ఆలకుంట్ల శ్రీనివాస్, పదో వార్డు సభ్యురాలు పొన్నం పారిజాతం,  మరియు పోలీస్సిబ్బంది పాల్గొన్నారు. IMG-20260413-WA0104

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .