సమ్మె బాటలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు.

సమ్మె బాటలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు.

- 7వ రోజుకు నిరవధిక సమ్మె.
- సేవా నియమాల అమలు కోరుతూ నిరసన.

సత్తుపల్లి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె మంగళవారం 7వ రోజుకు చేరింది. రాష్ట్ర టీవీఏఈ సంయుక్త చర్య కమిటీ (జేఏసీ) పిలుపు మేరకు ఆర్టిజన్, అన్‌మాన్, పనికి చెల్లింపు విధానంలో ఉన్న కార్మికులు విధులను బహిష్కరించి సత్తుపల్లి డివిజన్ కార్యాలయం ముందు టెంటు వేసుకొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి డివిజన్ చైర్మన్ గుగులోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ, శాఖలో రెండు విధాల సేవా నియమాలు అమలు చేయడం వల్ల ఆర్టిజన్ కార్మికులు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. పాతకాలపు నియమాలను కొనసాగిస్తూ తమపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్, గృహ వినియోగం, పరిశ్రమలకు నిరంతరాయ సరఫరా అందించడంలో తమ పాత్ర కీలకమైనప్పటికీ తగిన గుర్తింపు దక్కడం లేదని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు.
 *డిమాండ్లు* : ఒకే సంస్థలో ఒకే విధమైన సేవా నియమాలు అమలు చేయాలి. అన్‌మాన్ కార్మికులను ఆర్టిజన్‌లుగా గుర్తించాలి. పనికి చెల్లింపు విధానంలో ఉన్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఆర్టిజన్ కార్మికులను స్థిర ఉద్యోగులుగా మార్చాలి. 2026 వేతన సవరణ అమలు చేయాలి అని అన్నారు. ఈ సమ్మెలో రాందాస్ నాయక్, నాగేశ్వరరావు, శ్రీను, నర్సింహారావు, కనకదుర్గ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .