వాడవాడలలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.

వాడవాడలలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.

_కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి 

– సిఐటియు పిలుపు

కీసర, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర మండలంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ బంగారు నర్సింగరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని అన్నారు.భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కార్మిక హక్కులను పరిరక్షించాలంటే కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు.రాంపల్లి, దాయరా, జాఫర్‌గూడ, బండ్లగూడ, గోధుమకుంట, కరీంగూడ, దమ్మైగూడ ప్రాంతాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చింతపల్లి అశోక్, సిలివేరి సుదర్శన్‌తో పాటు నాగారం, దమ్మైగూడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సభ్యులు భాగ్యమ్మ, పోచయ్య, మహంకాళమ్మ, శీను, శ్రీకాంత్, జంగయ్య, జాన్ మోష, రాణి, నిఖిల, అశ్విని, దేవేందర్, మహేష్, హరి, కొండల్, కృష్ణ, జయమ్మ, నరసింహ, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260414-WA0098

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .