సత్తుపల్లిలో అంబేద్కర్‌కు ఘన నివాళులు.

సత్తుపల్లిలో అంబేద్కర్‌కు ఘన నివాళులు.

- సమానత్వం సాధనకు ఆయన ఆశయాలే మార్గం. 
- ఎమ్మెల్యే మట్టా రాగమయి.

సత్తుపల్లి, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం వహించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం సత్తుపల్లి పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద మెయిన్ రోడ్‌లో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ కమిషనర్ నరసింహ, మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమలపాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదే చెన్నారావు, సీనియర్ నాయకుడు చల్లగుళ్ల నరసింహIMG-20260414-WA0060 రావు, పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .