అంబేద్కర్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.

అంబేద్కర్ ఆశయాల సాధనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.

_ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సీఎం రేవంత్ రెడ్డి కృషి ఫలితం 

– పరమేశ్వర్ రెడ్డి

ఉప్పల్, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కృషి చేస్తుందని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు.కాప్రా డివిజన్ గాంధీ నగర్‌లో గాంధీ నగర్ యూత్ & వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితోనే సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా దళిత వర్గాల్లోని అన్ని కులాలకు సమాన న్యాయం జరిగిందని తెలిపారు. ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్‌ను మరియు భారత రాజ్యాంగాన్ని అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గాంధీ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .