ఇంటర్ ఫలితాల అనంతరం విద్యార్థి అదృశ్యం.

ఇంటర్ ఫలితాల అనంతరం విద్యార్థి అదృశ్యం.

_మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్… 

_మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన 17 ఏళ్ల యువకుడు

జవహర్ నగర్, ఏప్రిల్ 14 (తెలంగాణ ముచ్చట్లు)

మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్ ప్రాంతంలో ముత్తు స్వామి కాలనీ, ఇంటర్ విద్యార్థి అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేస్తోంది. పాత్లవత్ గోపాల్  కుమారుడు శ్రీ చరణ్ (17) ప్రస్తుతం ఈసీఐఎల్‌లోని న్యూ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.ఏప్రిల్ 12,న మధ్యాహ్నం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో శ్రీ చరణ్ మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. ఈ విషయం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన అదే రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా ఎటువంటి సమాచారం దొరకలేదు. దీంతో శ్రీ చరణ్ తండ్రి గోపాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .