వేలేరు గ్రామసభలో ప్రభుత్వ పథకాల ప్రగతిపై సమీక్ష
వేలేరు, ఏప్రిల్ 2 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా గ్రామసభ నిర్వహించబడింది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ బిల్లా యాదగిరి అధ్యక్షత వహించారు. గ్రామసభ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మండల తహసీల్దార్ కోమీ, మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.సమావేశంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల అమలు, ప్రగతి అంశాలపై చర్చ జరిగింది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, కల్యాణలక్ష్మి, వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు వంటి పథకాలపై వివరాలు తెలియజేశారు. గ్రామానికి మంజూరైన నిధులు, ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులు, ఇంకా చేయాల్సిన పనులపై సమగ్రంగా సమీక్షించారు. భవిష్యత్తులో గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు గ్రామసభలో విస్తృత చర్చ జరిగింది. దాదాపు 650 మంది గ్రామస్తులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, విద్యుత్ శాఖ అధికారి కుమారస్వామి, ఆరోగ్య శాఖ ప్రతినిధి నవీన్, గ్రామపంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్, మండల సమైక్య సీసీ, అలాగే విద్య, గృహ నిర్మాణ, వ్యవసాయ, ఉపాధి హామీ, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. వార్డు సభ్యులు సంధ్య, ప్రవళిక, మౌనిక, పర్వీన్, రణధీర్ రెడ్డి, జావిద్ పాషా, లక్ష్మీనారాయణ, ప్రశాంత్, సురేష్, సునీల్ తదితరులు హాజరయ్యారు.


Comments