వేలేరు గ్రామసభలో అభివృద్ధి పథకాలపై చర్చ

వేలేరు గ్రామసభలో అభివృద్ధి పథకాలపై చర్చ

 

IMG-20260402-WA0081

వేలేరు, ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన

ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ మీ యాదగిరి గారి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామసభ స్పెషల్ ఆఫీసర్ మరియు మండల తహసీల్దార్ శ్రీమతి కోమీ గారు, మండల స్పెషల్ ఆఫీసర్ రవీందర్ సింగ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలైన ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, కల్యాణలక్ష్మి, వడ్డీ లేని రుణాలు, కొత్త రేషన్ కార్డులపై చర్చించారు.
అదేవిధంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యల సహకారంతో గ్రామానికి మంజూరైన నిధులు, పూర్తయిన అభివృద్ధి పనులపై వివరించారు. భవిష్యత్తులో గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
గ్రామసభలో సుమారు 680 మంది గ్రామ ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకర్, విద్యుత్ శాఖ ఏఈ కుమారస్వామి, హెల్త్ డిపార్ట్మెంట్ నవీన్, జీపీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్‌బీఐ శాఖ మేనేజర్ కుమారస్వామి, వివిధ శాఖల అధికారులు మరియు వార్డు సభ్యులు సంధ్య, ప్రవళిక, మౌనిక, పర్వీన్, రణధీర్ రెడ్డి, జావిద్ పాషా, లక్ష్మీనారాయణ, ప్రశాంత్, సురేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .