చిల్పూర్‌లో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ నిర్వహణ
చిల్పూర్,ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చిల్పూర్ మండలంలో పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్–2026 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ పార్లమెంట్ కో-కన్వీనర్ ఇనుగాల యుగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగాం జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ హాజరై మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తరించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర నాయకులు ఉడుగుల రమేష్, బొజ్జపెల్లి శుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐలోని అంజిరెడ్డి, జిల్లా నాయకుడు తోకల సంపత్ రెడ్డి, జిల్లా ప్రభారీ బల్ల శ్రీనివాస్, జిల్లా కిసాన్ మోర్చా నాయకుడు గడ్డం రాజు, జిల్లా మీడియా కన్వీనర్ కాదుగాయ రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బాల్నే శ్రీనివాస్ గౌడ్, గాజుల సంపత్ పాల్గొన్నారు.
అలాగే స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణ గౌడ్, చిల్పూర్ మండల అధ్యక్షుడు గంటె ఉపేందర్ యాదవ్, భూక్య అనిల్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శులు వెలిశాల శ్రీనివాస్, పోలబోయిన జోగులు, సోషల్ మీడియా మండల కో-కన్వీనర్ ముక్కెర రమేష్ యాదవ్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఊరటి రాజు ముదిరాజ్, చిల్పూర్ బూత్ అధ్యక్షులు దామెర ప్రశాంత్, కట్ల అనిల్ కుమార్ ముదిరాజ్, శాగ పవన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల శిక్షణ, ప్రజా సమస్యలపై స్పందన, ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments