జమ్మికుంట గణేష్ నగర్‌లో దివ్య హనుమాన్ పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
Views: 7
On
జమ్మికుంట టౌన్, ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంటలోని గణేష్ నగర్ సంజీవని హనుమాన్ దేవాలయంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ దిలీప్ మాట్లాడుతూ, పట్టణ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.
అనంతరం ఆలయ అర్చకులు, భక్తులతో కలిసి ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి రాము, నేదూరి సమ్మయ్య, చరణ్, సదానందం, సమ్మయ్య సహా అనేక మంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments