వేకువజామునే జాగృతమైన భక్తి…
హుజురాబాద్‌లో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా
Views: 10
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 02 (తెలంగాణ ముచ్చట్లు):
హుజురాబాద్‌లోని ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి పారవశ్యంతో కళకళలాడింది. వేకువజామున నుంచే హనుమాన్ దీక్షాపరులు “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయాన్ని నింపి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు భాస్కర్ స్వామివారికి ఘనంగా అర్చనలు, అభిషేకాలు నిర్వహించగా, ఆలయం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయగా, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వీకరించారు.
హనుమాన్ దీక్ష పరుల కోసం ప్రత్యేకంగా అన్నదానం ఏర్పాటు చేసి, భక్తులకు సాత్విక భోజనం వడ్డించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని, ఆశీస్సులు పొందారు. మొత్తం మీద హుజురాబాద్‌లో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు భక్తి, శ్రద్ధ, వైభవాలతో సాగాయి.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments