భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేలు జరిమానా

ఖమ్మం బ్యూరో, ఏప్రిల్1(తెలంగాణ ముచ్చట్లు)

క్షణికావేశంలో భార్యను చంపిన భర్తకు ఏడేళ్లు జైలు శిక్ష, 5 వేల రూపాయలు జరిమానా విదిస్తూ 4వ అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి (ఫ్యామిలీ కోర్టు) ఎం అర్చన కుమారి  తీర్పు వెల్లడించారు. వివరాలకు వెళితే.. 2025 ఫిబ్రవరి 20 న మధ్యప్రదేశ్ రాష్ట్రందిండోరి ప్రాంతానికి చెందిన నిందితుడు కమలేష్ మరావి (38) అతని భార్య పింకీ మాధవి మిర్చికోత పనులకు నిమిత్తం కారేపల్లి మండలంలక్ష్మీపురం, జైత్రం తండా పంచాయతీ సమీపంలో పలువురు కూలీలతో కలిసి  ఉంటున్నారు. ఉదయాన్నే భార్యాభర్తలు గొడవపడి విచక్షణ కోల్పోయిన భర్త కమలేష్ భార్యను విపరీతంగా కొట్టడంతో మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు కారేపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 45/2025
 ఎస్సీ నెంబర్ .78/2025
సెక్షన్ 105 బిఎన్ఎస్  చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కు సహకరించిన అప్పటి విచారణ అధికారలు ఇన్స్పెక్టర్ బి. తిరుపతి రెడ్డి, ఎస్సై. రాజారాం, అదనపు ప్రభుత్వ న్యాయవాది
పి స్వప్న,కోర్టు డ్యూటీ ఆఫీసర్/హెడ్ కానిస్టేబుల్ టీ. వెంకటేశ్వరరావు, కోర్టు లైజనింగ్ కె.శ్రీకాంత్ ( ఎస్సై ))  కే. శ్రీనివాసరావు, (హెచ్ సి)
శ్రీనివాసరావు హోంగార్డ్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీసు అభినందించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .