ఉప్పల్ కూరగాయల మార్కెట్‌లో స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యం

ఉప్పల్ కూరగాయల మార్కెట్‌లో స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యం

_రూ.11 లక్షలతో ఫ్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు 

– మాజీ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ప్రారంభం

ఉప్పల్, మార్చి 31 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు, వినియోగదారుల కోసం స్వచ్ఛమైన మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రూ.11 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫ్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్‌ను మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి స్థానిక చిన్న వ్యాపారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మార్కెట్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. రోజూ వందలాది మంది వచ్చే ఈ మార్కెట్‌లో మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ వాటర్ ఫిల్టర్ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు.చిన్న వ్యాపారులు, వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ ఫిల్టర్ నిర్వహణ బాధ్యతలను మహిళా పొదుపు సంఘాలకు అప్పగించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వ్యాపారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.IMG-20260331-WA0084

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .