నేషనల్ ఆర్చరీ పోటీలో చక్రి నికిత్‌కు సిల్వర్ మెడల్

నేషనల్ ఆర్చరీ పోటీలో చక్రి నికిత్‌కు సిల్వర్ మెడల్

_గుంటూరులో మెరిసిన 9 ఏళ్ల బాలుడు

– స్ఫూర్తి గ్రూపు అభినందనలు

ఏ ఎస్ రావు నగర్ , మార్చి 31 (తెలంగాణ ముచ్చట్లు):

గుంటూరులోని వివిఐటి, నంబూరులో నిర్వహించిన నేషనల్ స్థాయి ఆర్చరీ పోటీల్లో మాస్టర్ చక్రి నికిత్ సిల్వర్ మెడల్ సాధించి విశేష ప్రతిభ కనబరిచాడు.కమలానగర్‌కు చెందిన చక్రి నికిత్ ఈసీఐఎల్ కొండాపూర్ సొసైటీ డైరెక్టర్ ద్వారకానాథ్ మనవడు.రాక్ హుడ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్న 9 ఏళ్ల ఈ బాలుడు తల్లిదండ్రులు సోనా ఘోష్, ఏ. క్రాంతి కుమార్. గతంలో పలు పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించి నేషనల్ స్థాయి పోటీలకు అర్హత పొందిన చక్రి నికిత్, ఈ పోటీల్లోనూ అద్భుత ప్రతిభతో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.ఈ సందర్భంగా చక్రి నికిత్ విజయాన్ని స్ఫూర్తి గ్రూపు సభ్యులు అభినందించారు. బాధ్యులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .