భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాలు.. 

పోస్టర్ ఆవిష్కరించి ఎస్ఐ వీరేందర్, బొడ్డు మధు.

భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాలు.. 

ఖమ్మం బ్యూరో,మార్చి 17(తెలంగాణ ముచ్చట్లు)

 విప్లవ వీరుడు భగత్సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ,డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతకాని ఎస్సై వీరేందర్  భగత్ సింగ్ వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచిన భగత్ సింగ్ ఆశలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం, లౌకికత్వం ,సమానత్వం కోసం పోరాడిన భగత్ సింగ్ త్యాగం భారత యువతకు పూర్తిగా నిర్మిస్తుందని తెలిపారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం విద్యారంగంపై దాడులు ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భగత్ సింగ్ ఆలోచనలు నేడు మరింత అవైశక్యంగా మారాయని వారు తెలిపారు. యువత సమాజ మార్పు కోసం చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజానికి పట్టిపీడిస్తున్న గంజాయి డ్రగ్స్ బెట్టింగ్ యాప్స్ తో యువత పెడదొరనులు పడుతున్నారని వాటికి వ్యతిరేకంగా విద్యార్థి యువత నడుం బిగించాలని సూచించారు. మండల కార్యదర్శి గడ్డం విజయ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నిర్వహించనున్న భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలలో భాగంగా జిల్లావ్యాప్తంగా సెమినార్లు సంస్కృతిక కార్యక్రమాలు చర్చా వేదికలు యువజన ర్యాలీలు డ్రగ్స్ గంజాయి బెట్టింగ్ యాప్ వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి అజయ్ గోపి, మండల నాయకులు నందకిషోర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు వేణుగోపాల్ తదితరులు ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం