ముస్లిం సోదరులకు రంజాన్ తూఫాలు పంపిణీ
మల్లాపూర్, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మల్లాపూర్ డివిజన్‌లోని ఎన్టీఆర్ నగర్ అలీ అబూ తాలిబ్ మజీద్ వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ తూఫాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి తో కలిసి కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ తూఫాలు అందజేశారు.ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ నెలలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, సౌభ్రాతృత్వంతో కలిసి జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రంజాన్ పండుగ ప్రేమ, సేవా భావం, సహనానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధన్పాల్ రెడ్డి, మల్లాపూర్ డివిజన్ మజీద్ కమిటీ అధ్యక్షులు ఎండి అనీఫ్, వసీం సాబ్, ఎండి కబీర్, ఎండి బాబా, ఎండి ముజాహిద్, ఎండి రహమతుల్లా, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, ఎస్.వి. కిట్టు, కోయగూర బాలరాజ్, దంతూరి రాజు గౌడ్, మక్తాల బాలరాజ్, టిల్లు ముదిరాజ్, జానీ, భాయ్ ముజిబ్, సురేష్, జయంత్, టిల్లు, సాయి, వినేష్ తదితరులు మరియు మసీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


Comments