కాప్రా సర్కిల్‌లో మెగా ఈ–వేస్ట్ కలెక్షన్ ప్రారంభం
కాప్రా, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజా పాలన పట్టణ ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా ఈ–వేస్ట్ కలెక్షన్ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు కాప్రా సర్కిల్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి పర్యవేక్షణలో సైనిక్పురి వార్డు కార్యాలయం, కాప్రా, ఏ.ఎస్.రావు నగర్, కుషాయిగూడ, ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్‌లలో మొత్తం ఐదు కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఈ–వేస్ట్ సేకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1633 కిలోల ఈ–వేస్ట్ సేకరించబడింది.కలెక్షన్ సెంటర్లతో పాటు వీధుల్లో మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ శానిటేషన్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఈ–వేస్ట్ సేకరించారు. సేకరించిన మెటీరియల్‌ను మున్సిపల్ కార్పొరేషన్ ఎంపిక చేసిన ఏజెన్సీలకు అప్పగించి, నిర్ణయించిన రేటు ప్రకారం యజమానులకు డబ్బులు చెల్లించనున్నారు. కాప్రా సర్కిల్ పరిధిలో RECO ఏజెన్సీ ద్వారా ఈ–వేస్ట్ మెటీరియల్‌ను డిస్పోజ్ చేయనున్నారు.ఈ కార్యక్రమం నేడు ఆదివారం కూడా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ సాలిడ్ మేనేజ్మెంట్ రవి, శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్, జవాన్లు సుధీర్, రామకృష్ణ, శ్రీనివాస్, ఎస్‌ఎఫ్‌ఏలు వసంత లక్ష్మి, సంజీవ్, ఇన్‌చార్జ్ ఎస్‌ఎఫ్‌ఏ అంజలి తదితరులు మరియు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


Comments