కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు

కాశీ యాత్రకు ప్రత్యేక బస్సు

కుషాయిగూడ, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో నుండి కాశీ యాత్రకు ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు సౌకర్యంగా హైదరాబాద్ నుంచి పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేలా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ యాత్రలో భాగంగా ఉజ్జయిని మహంకాళి, ఓంకారేశ్వర్, శారద శక్తిపీఠం, అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ వంటి పవిత్ర క్షేత్రాలను భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రత్యేక బస్సు మార్చి 28న సాయంత్రం 6 గంటలకు ఈసీఐఎల్ బస్టాండ్ నుండి బయలుదేరనుంది.
ఈ యాత్రకు టికెట్ ధర రూ.8,000గా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నెంబర్: 9959226145, 9603549388 నంబర్లను సంప్రదించాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .