మానవత్వంతో ముందుకు వచ్చిన జె. వెంకటేష్ యాదవ్

వృద్ధాశ్రమానికి 100 కిలోల బియ్యం, కూరగాయల అందజేత

మానవత్వంతో ముందుకు వచ్చిన జె. వెంకటేష్ యాదవ్

కీసర, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):

కీసర సర్కిల్ డివిజన్–1 పరిధిలోని వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో జె. వెంకటేష్ యాదవ్ ముందుకు వచ్చారు. వృద్ధులకు అవసరమైన 100 కిలోల బియ్యంతో పాటు కొన్ని కూరగాయలను సెరినిటీ పాఠశాల పీ.ఈ.టి ద్వారా వృద్ధాశ్రమానికి అందజేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, జె. వెంకటేష్ యాదవ్ చేసిన సహాయం వృద్ధులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించి వృద్ధులకు అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మచ్చాని రాజు యాదవ్, ముద్దం మల్లేష్ యాదవ్, ఆర్.సి.ఎం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .