కాప్రాలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫాల పంపిణీ

కాప్రాలో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫాల పంపిణీ

కాప్రా, మార్చి 14 (తెలంగాణ ముచ్చట్లు):

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫాలను ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. శనివారం కాప్రా పరిధిలోని ఏ.ఎస్. రావు నగర్ డివిజన్‌లో డి.ఎ.ఇ కాలనీ జామా మసీదు మరియు హెచ్.బి కాలనీ డివిజన్ కృష్ణానగర్ కాలనీ మసీదులో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ కానుకలను అందజేశారు.
ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగ సౌభ్రాతృత్వం, సేవా భావానికి ప్రతీక అని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర గౌరవంతో, ఐక్యతతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ధనపాల్ రెడ్డి, బొంతు శ్రీదేవి, సీతారాం రెడ్డి, అంజి రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజేందర్, విట్టల్ నాయక్, నాగిళ్ల బాల్ రెడ్డి, పెద్ది నాగరాజ్, పెద్ది శ్రీను, అజీజ్, బత్తుల శ్రీకాంత్, శ్రీకాంత్ రెడ్డి, బాషా, లింగం, మల్లారెడ్డి, ప్రకాష్ రెడ్డి, నరేందర్, సంతోష్ చారి, క్రాంతి, టిల్లు, గోపాల్ యాదవ్, చౌదరి, గుణశేఖర్, రాజు, హీరాలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.అలాగే హెచ్.బి కాలనీ డివిజన్ మజీద్ కమిటీ సభ్యులు సలీమ్, తాహెర్, పాషా, అక్బర్ పాల్గొన్నారు. డివిజన్ అధ్యక్షుడు పోలేపాక అంజయ్యతో పాటు కప్రా సాయికిరణ్ గౌడ్, రాయని ఉదయ్ కిరణ్, శ్రీనివాస్ ముదిరాజ్, అనిల్ గుప్తా, సుబ్బు, సురేష్ గౌడ్, వెంకట్, అప్పరో, మల్లేష్, సమయ, గణేష్, రమేష్, జోష్, మూసాల శ్రీనివాస్ రెడ్డి, రూపేందర్ రెడ్డి, కృష్ణ నాయక్, ముజీబ్, జానీ బాయ్, బాలరాజు తదితరులు హాజరయ్యారు.IMG-20260314-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News