ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి

_ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఆశా వర్కర్స్ యూనియన్

ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలి

మల్కాజిగిరి, మార్చి 13 (తెలంగాణ ముచ్చట్లు):

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కే. ఉన్నికృష్ణ, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం. రేవతి కళ్యాణి, జిల్లా ఉపాధ్యక్షురాలు కే. కోమలత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలని తెలిపారు. ఈ అంశాన్ని ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)కు సరిపడా నిధులు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న జనవరి, ఫిబ్రవరి నెలల పారితోషికాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.కరోనా సమయంలో ఆశా కార్యకర్తలు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ లీడర్స్ అవార్డును కూడా అందజేసిందని గుర్తు చేశారు.అనేక సేవలు అందిస్తున్నప్పటికీ ఆశా కార్యకర్తలకు చట్టబద్ధమైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా ఫిక్స్డ్ వేతనం ఇప్పటివరకు తెలంగాణలో అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆశా వర్కర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .