పెద్దమందడిలో న్యాయ సేవలు, వినియోగదారుల హక్కులపై అవగాహన 

పెద్దమందడిలో న్యాయ సేవలు, వినియోగదారుల హక్కులపై అవగాహన 

పెద్దమందడి,మార్చి13(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని రైతు వేదికలో న్యాయ సేవలు మరియు వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి రజిని  అధ్యక్షత వహించి ప్రజలకు న్యాయ సేవల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, న్యాయ సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా వినియోగదారుల హక్కుల గురించి ప్రజలకు వివరించి, సమస్యలు ఎదురైనప్పుడు న్యాయ సహాయం పొందే విధానాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి తహసీల్దార్ పాండు నాయక్ పాల్గొని మాట్లాడుతూ ప్రజలు న్యాయ సేవలు, వినియోగదారుల హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు.సమస్యలు ఎదురైనప్పుడు చట్టపరమైన మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, న్యాయవాది కృష్ణయ్య, జిల్లా న్యాయ సేవల సంస్థ సభ్యుడు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న వారు న్యాయ సేవలపై అవగాహన పెంపొందించుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .