అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!

దమ్మపేటలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ.

అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.!

దమ్మపేట, మార్చి 13 (తెలంగాణ ముచ్చట్లు):

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదర సోదరీమణులకు అందజేస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం దమ్మపేట మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. ఈ నెలలో ఉపవాసాలు పాటిస్తూ ప్రార్థనలు చేయడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు పరస్పర సహకారం, సోదరభావం పెంపొందుతాయని తెలిపారు. పేద మరియు మధ్యతరగతి ముస్లిం కుటుంబాలు ఆనందంగా రంజాన్ పండుగను జరుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రంజాన్ తోఫాను అందజేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి, ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, మందలపల్లి గుజ్జుల శ్రీనివాసరావు, ఎమ్మార్వో రామ్ నరేష్, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, చిన్నశెట్టి యుగంధర్, పర్వతనేని ప్రసాద్, అత్తులూరి వెంకట్రావు, పగడాల రాంబాబు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులుతదితరులు పాల్గొన్నారు.IMG-20260313-WA0053

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .