కుటుంబ కలహాలతో విషం సేవించి కూలీ మృతి

కుటుంబ కలహాలతో విషం సేవించి కూలీ మృతి

కీసర, మార్చి 11( తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం గోదుమకుంట గ్రామంలో విషం సేవించి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిరా లక్ష్మయ్య (50) వృత్తి రీత్యా కూలీగా పనిచేస్తూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.కుటుంబ కలహాల నేపథ్యంలో లక్ష్మయ్య ఈ నెల 10న థమ్స్ అప్ పానీయంలో గుర్తు తెలియని విషపదార్థం కలిపి సేవించినట్లు సమాచారం. విషం సేవించడంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మయ్య 11న ఉదయం 9.58 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడు చిరా రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కీసర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్కపల్లి ఆంజనేయులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .