మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ

_మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌లో ట్రావెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కారం 

– మహిళా సిబ్బంది సేవలకు ప్రశంసలు 

మల్కాజిగిరి, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సబర్బన్ ట్రైన్ ట్రావెలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా సఫాయి సిబ్బందికి చీరలు పంపిణీ చేసి వారి సేవలను గౌరవించారు.ఈ సందర్భంగా బిందు ఎలక్ట్రికల్, మాధురి ఎస్ & టీ, కాంచన కమర్షియల్, మౌనిక ఆర్‌పీఎఫ్ విభాగాల సిబ్బందిని జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు నూర్ శాలువాతో సత్కరించారు. రైల్వే స్టేషన్‌లో పరిశుభ్రత, ప్రయాణికుల సేవలో సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నిబద్ధతతో సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏ.వి. స్వామి, భరద్వాజ్, స్టేషన్ మేనేజర్ శ్రీనివాస్ రావు, శంకర్ రావు, ఆఫజలుద్దీన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .