ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యం- గ్రామంలోని నీటి నిల్వ ట్యాంకుల శుభ్రపరిచిన సర్పంచ్
పెద్దమందడి,మార్చి11(తెలంగాణ ముచ్చట్లు):
మన గ్రామం – మన అభివృద్ధి అనే నినాదంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని నీటి నిల్వ ట్యాంకులను శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నారు.గ్రామంలో ఉన్న నీటి నిల్వ ట్యాంకులు పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలకు అందే తాగునీరు స్వచ్ఛంగా ఉండాలని సర్పంచ్ ప్రత్యేక దృష్టి పెట్టారు.అంటువ్యాధులు, దురద, అలర్జీ వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు ట్యాంకులను బ్లీచింగ్ పొడి ఉపయోగించి శుద్ధి చేశారు.ఈ కార్యక్రమంలో నీటి సరఫరా బాధ్యతలు నిర్వహిస్తున్న జుర్రు శివతో కలిసి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి పనులు చేయించారు.అంతేకాకుండా ఆయనతో పాటు శ్రీకాంత్ రెడ్డి కూడా స్వయంగా ట్యాంకుల శుభ్రపరిచే పనుల్లో పాల్గొన్నారు.గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని సర్పంచ్ తెలిపారు.


Comments