లింగ వివక్షకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి

లింగ వివక్షకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి

_సిఐటియు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీ
 
– ఎస్.వి.రమ పిలుపు

ఏ ఎస్ రావు నగర్, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

లింగ వివక్షను, మహిళలపై జరుగుతున్న దాడులను సమాజం మొత్తం కలిసి ప్రతిఘటించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్.వి. రమ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కమలానగర్‌లోని సిఐటియు కార్యాలయం భాస్కర్ భవన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం. వినోద, జిల్లా శ్రామిక మహిళ కన్వీనర్ ఎం. రేవతి కళ్యాణి అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎస్.వి. రమ మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మహిళల సుదీర్ఘ పోరాటాల ఫలితమని తెలిపారు. 1901లో కోపెన్‌హేగన్‌లో జరిగిన సోషలిస్ట్ మహిళల సదస్సులో క్లారా జెట్కిన్ ప్రతిపాదనతో మహిళా దినోత్సవం ప్రారంభమైందన్నారు. న్యూయార్క్ గార్మెంట్ కార్మికుల పోరాటాలు, మహిళా కార్మికుల భారీ ప్రదర్శనలు మహిళా ఉద్యమాలకు నాంది పలికాయని చెప్పారు. అయితే నేడు పాలకులు, కార్పొరేట్ సంస్థలు మార్చి 8ను వ్యాపార ప్రకటనలు, వస్తువుల అమ్మకాలకే పరిమితం చేస్తూ మహిళా ఉద్యమాల స్ఫూర్తిని నీరుగారుస్తున్నాయని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తోందని, మహిళలకు సమాన హక్కులు, సమాన పనికి సమాన వేతనం కల్పించడంలో విఫలమైందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలపై హింసలు పెరుగుతున్నప్పటికీ నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రామిక మహిళలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయడం అన్యాయమని అన్నారు.ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణజ్యోతి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం వల్ల గ్రామీణ మహిళల జీవనోపాధిపై ప్రభావం పడుతోందన్నారు. మహిళలపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు, హత్యలు పెరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో పాలకులు విఫలమవుతున్నారని విమర్శించారు. మహిళా సాధికారత పేరుతో గొప్పలు చెప్పే ప్రభుత్వం వాస్తవంలో పురుషాధిపత్యానికే ప్రోత్సాహం ఇస్తోందన్నారు.శ్రామిక మహిళ మేడ్చల్ జిల్లా కన్వీనర్ ఎం. రేవతి కళ్యాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మహిళలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. మహిళలకు సమాన హక్కులు, సమాన పనికి సమాన వేతనం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం (2013) అమలులో లోపాలున్నాయని అన్నారు. అన్ని కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేసి చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కె. ఉన్నికృష్ణన్, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు జి. సునీత, బి. శోభారాణి, ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు డి. అనిత, నాయకులు కవిత, జెవివి జిల్లా కోశాధికారి జెన్నీ, ధరణి దినపత్రిక IMG-20260310-WA0093ఎడిటర్ రోజారాణి, స్ఫూర్తి నాయకురాలు పద్మావతి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఎ. సృజన తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!