ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఈవిఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం బ్యూరో, మార్చి -10(తెలంగాణ ముచ్చట్లు)

త్రైమాసిక తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న  ఈవిఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, రాజకీయ ప్రతినిధులతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా ఈవిఎం గోడౌన్ సీల్ ను పరిశీలించి రాజకీయ ప్రతినిధులు, అధికారుల సమక్షంలో సీల్ తీసి లోపలికి వెళ్లి, ఈ.వి.ఎం., వి.వి.ప్యాట్లు ఉన్న గది లోపల పరిశీలన చేసి తిరిగి సీల్ వేయించారు. తనిఖీ రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. అలారం, ఫైర్ సేఫ్టీ పరికరాలు పరిశీలించారు. సీసీ కెమెరాల పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందికి తెలిపారు. ఎన్నికల సామాగ్రి భద్రత అత్యంత ముఖ్యమని, సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకులు ఎం.ఏ. రాజు, ఆర్ అండ్ బి డిఇ లఖన్ నాయక్, ఏ ఇ లలిత, ఎన్నికల డిటి అన్సారీ, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి స్వర్ణ సుబ్బారావు, బహుజన్ సమాజ్ పార్టి ప్రతినిధి ఎం. కిషోర్, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి ఎల్. సతీష్ బాబు, సిపిఐ (ఎం) పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాష్, ఐఎన్ సి పార్టీ ప్రతినిధి అన్నెం గోపాల్ రావు, టిడిపి పార్టీ ప్రతినిధి పాలడుగు టిఆర్ కృష్ణప్రసాద్, అధికారులు, తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .