ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్

కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు.చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, కీసర పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో నిందితులు అమర్ రాజ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ లతీఫ్ ఖాన్, గులాం హుస్సేన్ ఖాన్‌లను అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి ఉప్పల్, కీసర ప్రాంతాల్లో ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పలు చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకుని విచారించగా, అనేక చోరీ కేసుల్లో వారి ప్రమేయం బయటపడింది.నిందితుల వద్ద నుంచి సుమారు రూ.13 లక్షల విలువైన 65 గ్రాముల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు మోటార్ సైకిళ్లు, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .