డ్రగ్స్ నియంత్రణపై వేలేరు పోలీసుల అవగాహన సమావేశాలు

డ్రగ్స్ నియంత్రణపై వేలేరు పోలీసుల అవగాహన సమావేశాలు

వేలేరు, మార్చ్ 10 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మరిపేట, మల్లికుదుర్ల, షోడశపల్లి, వేలేరు గ్రామాల్లో డ్రగ్స్ నియంత్రణపై విస్తృత అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐ ఎ. పూర్ణేశ్వర్ అధ్యక్షత వహించారు.
TGNAB ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఐ పూర్ణేశ్వర్ మాట్లాడుతూ డ్రగ్స్ అనే మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయం మరియు వినియోగంపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి చదువు, క్రీడలు మరియు మంచి లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ సమస్యను అరికట్టడం మరియు యువతలో అవగాహన పెంపొందించడం లక్ష్యంగా వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వేలేరు ఎస్సై సురేష్ తెలిపారు.IMG-20260310-WA0109

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .