ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య

వరంగల్,మార్చి10(తెలంగాణ ముచ్చట్లు): 

న్యూఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీ సీనియర్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణను అధిష్ఠానం నియమించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్యతో కలిసి ఎర్రబెల్లి స్వర్ణ మల్లికార్జున ఖర్గేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఎర్రబెల్లి స్వర్ణ పేర్కొన్నారు. తెలంగాణలో మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని మరింత పెంచుతూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .