పరిసరాల పరిశుభ్రతతోనే మానవాళి మనుగడ

పరిసరాల పరిశుభ్రతతోనే మానవాళి మనుగడ

_కాప్రా చెరువును సందర్శించిన మల్కాజిగిరి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

_పలు సూచనలు చేసిన ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా

కాప్రా, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చెరువుల పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని మంగళవారం కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా చెరువు వద్ద నిర్వహించారు. చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని మల్కాజిగిరి జిహెచ్ఎంసి కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, పారిశుద్ధ్య సిబ్బంది, ఎంటమాలజీ విభాగం సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం సుమారు 125 మంది ఈ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని చెరువు పరిసరాలను శుభ్రం చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ చెరువులు సహా నీటి వనరులను పరిరక్షించడం, పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చెరువుల పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన జీవన విధానం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరి, డీఈ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) రవి, సానిటరీ సూపర్వైజర్ సుదర్శన్, ఎంటమాలజీ ఏఈ డి.రమేష్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, యూబీడీ విభాగం సిబ్బంది, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260310-WA0098

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .