పేదప్రజల పక్షపాతి పంది నారాయణ

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు

పేదప్రజల పక్షపాతి పంది నారాయణ

ఖమ్మం బ్యూరో, మార్చి 10(తెలంగాణ ముచ్చట్లు)

పేదప్రజల హక్కుల కోసం పోరాడిన పంది నారాయణ చిరస్మరణియుడని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు పేర్కొన్నారు. నాగిలిగొండ గ్రామంలో మంగళవారం కామ్రేడ్ పంది నారాయణ 38వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రవీంద్రబాబు మాట్లాడుతూ ఆనాటి భూస్వామ్య గుండాల చేతిలో హతమైన అమరజీవి నారాయణ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యునిస్టుగా మారి గ్రామంలో కూలి రేట్ల పెంపు కోసం, అనేక భూపోరాటాలు నిర్వహించి జైలు జీవితం గడిపారన్నారు. పేద ప్రజలకు భూపంపిణీ, ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాటాలను నిర్వహించిన నారాయణను భూస్వామ్య గూండాలు దారుణంగా హత్యచేసారన్నారు. ఆయన మరణం నాగిలిగొండ పరిసర గ్రామల్లో ఒక చైతన్యాన్ని తీసుకువచ్చిందన్నారు. పేద ప్రజల పక్షాన నిలబడి చేసే పోరాటాలే నారాయణ కు మనమిచ్చే నిజమైన ఘన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పావులూరి మల్లిఖార్జునరావు నాయకులు పదిమల వెంకటనర్సయ్య, శాఖ కార్యదర్శి చాట్ల రమేష్, బాబు, పంది నాగేశ్వరరావు, శేఖర్, అరికోట్ల భాస్కర్, సుధాకర్, షైక్, చిన్న జానీ, షేక్ హుస్సేన్, ఫిలిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .