కలెక్టరేట్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
మేడ్చల్–మల్కాజిగిరి, మార్చ్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, సమాజంలో వారికి సమాన గౌరవం మరియు హక్కులు కల్పించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీఓఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా చెస్, క్యారం, లెమన్ అండ్ స్పూన్, స్పీడ్ వాకింగ్, రన్నింగ్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ వంటి పలు ఆటల పోటీలను నిర్వహించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి రెవెన్యూ అధికారిని చంద్రావతి తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మను చౌదరి సతీమణి డా. రాధ మను చౌదరి హాజరయ్యారు.ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ అమ్మాయి చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మహిళలు మానసికంగా ధృడంగా ఉండి కృషి చేస్తే ఏ రంగంలోనైనా ముందంజలో నిలుస్తారని తెలిపారు. ఆడపిల్లల విద్యాభివృద్ధికి మహిళలు ముందుండి ప్రోత్సాహం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో జిల్లా విద్యాధికారిని విజయకుమారి, జిల్లా షెడ్యూల్డ్ కాస్ట్ అభివృద్ధి అధికారి వినోద్, డీఆర్‌డీఓ సాంబశివరావు, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి దామోదర్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారిని సుగుణాబాయి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అజేయలక్ష్మి, మేడ్చల్ డిపో ఏఈ స్నేహలత, టీఎన్జీవో జనరల్ సెక్రటరీ కురుమూర్తి, జాయింట్ సెక్రటరీ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.అనంతరం మహిళా వ్యవస్థాపకులు మరియు మహిళా సంఘాల ప్రతినిధులను సన్మానించారు. అలాగే వివిధ క్రీడా పోటీల్లో విజేతలైన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు.



Comments